ఖలిస్థానీ టెర్రరిస్టు గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌ను మరోసారి హెచ్చరించాడు. గతంలో దేశీయ విమానాలను పేల్చేస్తానని బెదిరించిన పన్నూ.. తాజాగా దేశంలోని సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని హెచ్చరికలు పంపాడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విదేశీ పర్యటనల గురించి సమాచారం ఇచ్చిన వారికి మిలియన్ డాలర్లు రివార్డుగా ఇస్తానని ప్రకటించాడు. అమెరికా కేంద్రంగా పన్నూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.
‘భారత సీఆర్పీఎఫ్‌కు హోం మంత్రి అమిత్‌షా నాయకత్వం వహిస్తున్నారు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్యకు ఆయనే కుట్రదారు.కిరాయి హంతకులను ఆయనే నియమించారు. న్యూయార్క్‌లో నా హత్యకు సైతం కుట్ర పన్నారు’ అని ఆరోపించారు.సీఆర్పీఎఫ్ మాజీ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లపై పన్నూ ఫైర్ అయ్యాడు. వారు తమ హక్కులనే కాలరాశారని, పంజాబ్ సహా విదేశాల్లోని సిక్కులపై దాడులు జరిపారని ఆరోపించారు.స్వర్ణ దేవాలయంపై దాడి, 1984 సిక్కుల ఊచకోత సీఆర్పీఎఫ్ చేసిన పనే అని ఆరోపించాడు.