దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. గురువారం రాత్రి దిశ హత్యచారం జరిగిన స్పాట్లోనే పోలీసుల సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలోనే పోలీసులు వెంటనే ఆ నలుగురు నిందితులను నిర్దాక్షిణ్యంగా ఎన్‌కౌంటర్ చేసేశారు. నలుగురు నిందితులు స్పాట్లోనే మృతిచెందారు.
ఈ ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా పార్టీలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఎన్‌కౌంటర్‌పై దిశ తల్లిదండ్రులు స్పందించారు. నిందితులకు తగిన శిక్ష పడిందని అన్నారు. తమ కుమార్తెపై జరిగిన ఘోరానికి… ఆ దారుణానికి ఇప్పుడు తగిన న్యాయం జరిగిందంటూ వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపై ఏ ఆడపిల్లపై కూడా ఇలాంటి మళ్లీ పునరావృతం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఏదేమైనా దిశ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు… అయితే తమ బిడ్డలా మరొ ఆడబిడ్డ బలి కాకూడదనే ఆమె తల్లిదండ్రులు ఈ ఎన్‌కౌంటర్‌పై తమ స్పందన తెలియజేశారు. దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు.