పరిటాల వర్సెస్ కేతిరెడ్డి: ధర్మవరంలో కొత్త ట్విస్ట్?

-

అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఈ నియోజకవర్గ రాజకీయాలు అంతగా హైలైట్ అయ్యేవి కాదు..కానీ ఎప్పుడైతే పరిటాల శ్రీరామ్ నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నారో అప్పటినుంచి సీన్ మారిపోయింది. అయితే మొదట్లో శ్రీరామ్ అంత దూకుడుగా పనిచేయలేదు. దీంతో ధర్మవరంలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డికి తిరుగులేదన్నట్లు పరిస్తితి ఉండేది. పైగా ఆయన ప్రజల మధ్యలో ఎక్కువగా తిరుగుతారు. వారి సమస్యలని తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించడానికి చూస్తారు.

దీంతో ధర్మవరంలో కేతిరెడ్డికి తిరుగులేదన్నట్లు ఉండేది. పైగా లోకల్ ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్‌గా గెలిచేసింది…దీంతో టీడీపీ పని అయిపోయిందన్నట్లు పరిస్తితి వచ్చింది. కానీ నిదానంగా ఇక్కడ పరిటాల శ్రీరామ్ పుంజుకున్నారు. టీడీపీ బాధ్యతలని చూసుకుంటున్న శ్రీరామ్…దూకుడుగా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు. కేతిరెడ్డికి ఎలాగైనా చెక్ పెట్టాలనే దిశగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కేతిరెడ్డి…తన అనుచరుల ద్వారా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, స్థలం కొనాలన్నా అమ్మాలన్నా ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టవలసిందేనని శ్రీరామ్ ఆరోపించారు. ఇక ఇవే ఆరోపణలు బీజేపీ నేత సూర్యనారాయణ చేస్తున్నారు. ఏకంగా కేతిరెడ్డి అవినీతి కార్యక్రమాల అంటూ మీడియా సమావేశాలు పెడుతూ…వీడియోలని వదులుతున్నారు. ఇలా ఇద్దరు నేతలు కేతిరెడ్డి టార్గెట్‌గా ముందుకెళుతున్నారు. అయితే గాలి మాటలు చెప్పకుండా, ఆధారాలు ఉంటే చూపించాలని కేతిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

ఇక దీనిపై మరింత దూకుడుగా ముందుకెళ్ళేందుకు శ్రీరామ్ సిద్ధమవుతున్నారు. అదే సమయంలో నెక్స్ట్ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు దక్కించుకోవాలని సూర్యనారాయణ ట్రై చేస్తున్నారు. కానీ ఆ ఛాన్స్ ఇచ్చేది లేదని శ్రీరామ్ అంటున్నారు. ధర్మవరం సీటు తనదే అని చెబుతున్నారు. అలాగే కేతిరెడ్డికి చెక్ పెట్టి ధర్మవరంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. మొత్తానికైతే ధర్మవరంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version