నేటి నుంచి ప్రారంభం అయ్యే పార్లమెంట్ సమావేశాలు ఆసక్తిగా మారాయి. 18 రోజుల రుతుపవనాల సమావేశంలో 18 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలు చర్చించనున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటన చేసింది. జీరో అవర్‌ను సగానికి తగ్గించారు అంతే కాకుండా క్వశ్చన్ అవర్ ని పూర్తిగా రద్దు చేసారు. ఇక ఇదిలా ఉంటే ఈ సమావేశాలకు ఇద్దరు కీలక వ్యక్తులు దూరం కానున్నారు.
హోం మంత్రి అమిత్ షా అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ సమావేశాలకు దూరం కానున్నారు. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా దేశం విడిచి వెళ్ళారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, లోక్‌సభ 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందని కేంద్రం పేర్కొంది.