మంట పుట్టిస్తున్న ‘ కృష్ణా ‘ పాలిటిక్స్  ?

-

ఏపీలో మిగతా జిల్లాల్లో రాజకీయం ఎలా ఉన్నా, కృష్ణాజిల్లాలో మాత్రం రాజకీయం ఎప్పుడు టెన్షన్ టెన్షన్ గానే ఉంటుంది. రాజకీయ ఉద్దండులు అంతా ఈ జిల్లాల నుంచి వచ్చిన వారే కావడంతో ఇక్కడు ఎక్కడ చూసినా ఆధిపత్యపోరు నడుస్తూ వస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమదే పై చేయి కావాలి అన్నట్లుగా కొంతమంది నాయకులు వ్యవహరిస్తూ ఉండడం, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా, అధికార పార్టీ నాయకులు తమ హావ చూపించేందుకు ప్రయత్నిస్తూనే వారిని అనేక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం, ఇలా ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే తీరు మరీ శృతి మిస్తూ వస్తుండడంతో, కృష్ణాజిల్లా పేరు చెబితేనే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా ఏపీ రాజకీయాల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది.
కేవలం పార్టీల మధ్య మాత్రమే కాకుండా, నాయకులు మధ్య వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది.అలాగే ఈ వ్యవహారంలో కి వారి కుటుంబ సభ్యులను లాగుతూ, రాజకీయాలకు అర్థం పరమార్థం మార్చేస్తున్నారు. ఇదిలా ఉంటే కృష్ణా జిల్లాలో ప్రస్తుతం దేవినేని ఉమా కొడాలి నాని మధ్య మొదలైన వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. దీంతో పాటు మైలవరం నియోజక వర్గంలో వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
అలాగే నాని ఉమా మధ్య మొదటి నుంచి వివాదం ఉండడంతో, ఇప్పటికీ అది కొనసాగుతూ వస్తోంది. అలాగే మచిలీపట్నం నియోజకవర్గానికి వస్తే మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మధ్య పోరు మరింత తీవ్రమైంది. ఇటీవల వైసీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్యలో కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లి ఈ మధ్యనే బయటకు వచ్చారు. ఇక్కడ కూడా రానున్న రోజుల్లో ఇద్దరు నాయకుల మధ్య పాత కక్షలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇక పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి పార్థసారధి మధ్య వివాదాలు నెలకొన్నాయి. పేదల ఇళ్ల స్థలాలు కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ, పేదలకోసం ఇళ్ల స్థలాలు కొనుగోలు విషయంలో 150 కోట్ల రూపాయల అవినీతికి పార్థసారధి పాల్పడ్డారని బోడె ప్రసాద్ సంచలన ఆరోపణలు చేయడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ నడుస్తోంది.
వీరిద్దరి వ్యవహారం ఇలా ఉంటే, దేవినేని ఉమా, కొడాలి నాని మధ్య మాత్రం తీవ్ర స్థాయిలో పోరు ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. వ్యక్తిగతంగా దూషించుకుంటూ వస్తున్నారు. కొడాలి నాని పై దేవినేని ఉమా పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి  వ్యవహారాలు నడిచాయి. కృష్ణా జిల్లా పేరు చెప్తే టిడిపికి కంచుకోటగా ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కనీసం అధినేత చంద్రబాబును సైతం లెక్క చేసే పరిస్థితుల్లో నాయకులు లేకపోవడం టీడీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version