నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాని పట్టుకున్న పటాన్చెరువు పోలీసులు

-

ఇస్నాపూర్ లోని ఓ కంపెనీలో నార్కోటిక్ డ్రగ్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పటాన్చెరు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్నాపూర్ కేంద్రంగా అక్రమంగా నార్కొటిక్ డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. కీలక ముఠా సభ్యులు మదన్ మోహన్ రెడ్డి, గురువా రెడ్డి, మనోహర్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. ఆరు లక్షల విలువచేసే నార్కోడ్రగ్స్ (డైజోఫామ్, అలెఫ్రోజోలం, కల్లులో కలిపే పదార్థం) సీజ్ చేశారు. 40 డ్రమ్ముల్లో ఉన్న ముడి పదార్థం ఒక కారు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పటాన్ చెరు పోలీసులు. వీరిపై డ్రగ్స్ తయారు చేసి పట్టుబడినట్టు గతంలో సిద్దిపేట జిల్లాలో కేసులు నమోదయ్యాయి. మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు పటాన్ చెరు సీఐ వేణుగోపాల్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version