పతంజలి కేస్….సుప్రీంకోర్టుకు చేతులు జోడించి వేడుకున్న అధికారి !

-

పతంజలి కేసు విచారణ సందర్భంగా క్షమించమని కోరిన ఓ అధికారిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నేను 2023 జూన్లో వచ్చాను. ఈ వ్యవహారం నేను రాక ముందు జరిగింది. నన్ను వదిలేయండి’ అని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారి డా. మిథిలేశ్ చేతులు జోడించి వేడుకున్నారు. ఇందుకు బదులుగా.. ‘ఎందుకు క్షమించాలి? మీరేం చర్యలు తీసుకున్నారు?’ అని అతన్ని ప్రశ్నించింది. అంతకుముందు పతంజలి యాజమాన్యంపై కూడా కోర్టు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

కాగా, పతంజలి ఆయుర్వేద్ సంస్థ అల్లోపతి చికిత్సను టార్గెట్ చేస్తూ యాడ్స్ ప్రసారం చేయడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ తరహా యాడ్స్ను నిలిపివేయకుంటే రూ. కోటి జరిమానా విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రెస్మీట్లలోనూ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం సూచించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news