వారాహి యాత్రలో భాగంగా పవన్ ఆదివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు.ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అధికార వైసీపీ, ముఖ్యమంత్రి జగన్‌పై తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నేతలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎన్నికల కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని పవన్‌ను ఈసీ ఆదేశించింది. కాగా ఇటీవల చంద్రబాబు, జగన్కు కూడా ఈసీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
