మాల్దీవులకు టిడిపి నేత పట్టాభి..? ఫోటోలు వైరల్..!

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు హీతెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్ పై చేసిన కామెంట్లతో రాష్ట్రంలో అలజడి మొదలైంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలకు వైసిపి కార్యకర్తలు టిడిపి ఆఫీసులపై పట్టాభి ఇంటిపై దాడి చేశారు. దాంతో టిడిపి వైసిపి ధర్నాలు నిరసన లు చేయడం మొదలు పెట్టాయి. ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు రాష్ట్రపతిని కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడం కూడా జరిగింది.

అయితే సీఎం ను దూషించిన కేసులో పట్టాభిని అరెస్ట్ చేయగా రాజమండ్రి జైలు నుండి ఇటీవల విడుదల అయ్యారు. అయితే జైలు నుండి విడుదలైన నాటి నుండి పట్టాభి కనిపించకుండా పోయారు. కాగా తాజాగా రాజమండ్రి జైలు నుంచి విడుదలైన పట్టాభి ఫ్లైట్లో ప్రత్యక్షమయ్యారు. పట్టాభి విమానంలో ప్రయాణిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పట్టాభి దేశం వదిలి మాల్దీవులకు పారిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పట్టాభి ప్రయాణిస్తున్న విమానం నెంబర్ తో సహా పోస్ట్ చేసి ఫోటోలు పెడుతున్నారు.