గూగుల్ కు గుండె కాయ.. అమెజాన్ కు ఆయువుపట్టు : హైదరాబాద్ పై కేటీఆర్ కామెంట్

-

గూగుల్ కి గుండె కాయ హైదరాబాద్ .. అమెజాన్ కి హైదరాబాద్ ఆయువు పట్టు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ జరిగిన టిఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఐటి అంటే ఇన్క్రెడిబుల్ తెలంగాణ అని.. ఆగం అయిపోతుంది అనుకున్న తెలంగాణ నేడు ఆదర్శంగా మారిందన్నారు. తెలంగాణలో త్రి ఐ మంత్ర నడుస్తుందని.. రాష్ట్ర సమాచారాన్ని సమగ్ర కుటుంబ సర్వేతో సేకరించి అభివృద్ధి ప్రారంభించామని పేర్కొన్నారు.

ఈ రోజు తెలంగాణలో జరిగేది…రేపు దేశంలో జరుగుతుందని.. పరిపాలన సంస్కరణలకు ఈ 7 ఏళ్ళు సువర్ణ యుగమని చెప్పారు. పది జిల్లాలు ఉన్న జిల్లాలను 33 జిల్లాలుగా చేసి పరిపాలన సౌలభ్యంగా మార్చుకున్నామని.. 12769కి పంచాయతీలను పెంచామని వెల్లడించారు.

పంచాయతీ రాజ్ కొత్త చట్టంతో అనేక సంస్కరణలు తెచ్చామని.. ప్రతీపల్లె ఒక ఆదర్శ గ్రామంగా మారిందన్నారు. మున్సిపల్ లో పేరుకుపోయిన అవినీతిని కదిగిపారేసే విధంగా కొత్త ఛట్ఠం తెచ్చామని.. శాంతి భద్రతలను పటిష్ట వంతం చేశాం, భద్రతలో తెలంగాణను నెంబర్ వన్ గా మార్చామని స్పష్టం చేశారు. పరిపాలన సంస్కరణలు మెచ్చుకునేలా చేశామని.. భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయ్యిందని వెల్లడించారు. సాగునీటి శాఖను ఒకే గొడుగు కిందకు తెచ్చామని.. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా జోనల్ విధానం తెచ్చామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news