పవన్ ఫ్యాన్స్ హంగామా: ఇదేమి గోలరా బాబు అంటున్న హరీశ్ శంకర్..!!

-

దర్శకుడు హరీశ్ శంకర్ తన చివరి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు దాటినా కూడా ఇంకో సినిమా చేతుల్లో లేదు. పవన్ కళ్యాణ్ తో  భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేయడానికి హరీష్ శంకర్ చాలా రోజుల గా ఎదురు చూస్తున్నాడు.పవన్ కల్యాణ్ తో హరీష్ శంకర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై ఎలాంటి అప్ డేట్ రావడంలేదు.

దీంతో ఈ ప్రాజెక్ట్ వున్నట్టా లేనట్టా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి షెడ్యూల్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక  పవన్ కళ్యాణ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న హరీష్ శంకర్  ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ కోరినట్లు గా తెలుస్తోంది. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారట . రీమేక్ అని భీమ్లా నాయక్ తీస్తే హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అందుకోలేక పోయింది. గతంలో సొంతంగా రాసిన కథ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక మళ్లీ రీమేక్ అని టీవీ లో ఎన్నో సార్లు అరిగిపోయిన రికార్డు లా వేసిన తేరి ని తీస్తే ఎలా అని గోల గోల చేస్తున్నారు. కొంత మంది చస్తామని కూడా హరీష్ కు  లెటర్స్ రాస్తున్నారు. హరీశ్ మాత్రం మధ్యలో నాకేం సంబంధం, ఇదేం గోల అని తల పట్టుకుని కూర్చున్నాడట.

 

Read more RELATED
Recommended to you

Latest news