జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాల సౌరి జనసేన పార్టీలో చేరనున్నారన్న విషయం మనకి తెలుసు ఈ క్రమంలో హైదరాబాదులో ఆయన పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ఏపీ రాజకీయ పరిస్థితుల గురించి వాళ్ళు చర్చించినట్లు తెలుస్తోంది బాల సౌరి జనసేనలో చేరడం ఖాయం కావడం వలన ఉమ్మడి కృష్ణ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. బందరు నుండి బరిలోకి దిగుతారా లేదంటే సొంత ఊరు గుంటూర అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయిపోయింది దీని గురించి అంతా చర్చించుకుంటున్నారు.
సీఎం జగన్ కి సన్నిహితుడైన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేసేసారు. రాజీనామా లేఖ ని పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. పార్టీలో తనకి తగినంత ప్రాధాన్యత లేకపోవడం వలన పార్టీని విడిచిపెట్టారు. వైసీపీకి రాజీనామా చేయకముందే పార్టీని వీడుతారనే ప్రచారం అయితే జోరుగా సాగింది. సోషల్ మీడియా అకౌంట్లో వైయస్ జగన్ ఫోటోలని కూడా ఆయన తీసేసారు. మొత్తం మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరీ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయిపోయారు.