పవన్ సంచలనం:బాలయ్యతో పాటు ఆ టాక్ షోలో కూడా.!

-

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల షూటింగ్ కి అడ్డంకి  ఎదురవుతూనే ఉంది.. దీంతో ఎప్పుడు ఈ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తుంది. పవన్ కూడా రాజకీయాలకు, సినిమాలకి టైమ్ ఇస్తూ వస్తున్నాడు.

తాజాగా చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమా షూటింగ్ కోసం పవన్ మళ్ళీ సెట్స్ లోకి”హరిహర వీరమల్లు” అడుగు పెట్టాడు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరగా కంప్లీట్ చేయాలని పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారట. ఎందుకంటే ఈ సినిమా చాలా రోజుల నుండి కొనసాగుతోంది అలాగే రెండు సార్లు సెట్స్ తీసి మళ్ళీ వేయాల్సి వచ్చింది. దీనితో నిర్మాతలకు వడ్డీలు బాగా పెరగడం తో పాటు, సినిమా ఖర్చు కూడా తడిసి మోపెడు అయ్యిందట. కాని ఈ విషయాన్ని పవన్ తో కాకుండా డైరెక్టర్ తోనే స్మూత్ గా డీల్ చేస్తున్నారట.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో మరో  సంచలన న్యూస్ బయటకు వచ్చింది. ఒక వైపు పవన్ బాలయ్య టాక్ షో లో పాల్గొంటారు అని వార్తలు వస్తుండగా, లేటెస్టుగా ఆయన ఆలీ షో లో కూడా పాల్గొంటారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలే పవన్ జగన్ అంటే ఢీ అంటే ఢీ అన్నట్లుగా మాట్లాడుతూ వుంటే, తాజాగా జగన్ వద్ద పదవి పొందిన ఆలీ తో టాక్ షో అంటే అది మీడియా లో హైలెట్ అయ్యే అవకాశం ఉంది. షోలో పాల్గొనటం గురించి పవన్ మనసులో ఏముందో మరికొద్ది రోజుల్లో తెలిసి పోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news