సీఎం కేసీఆర్ చెరుకు రైతుల నోట్లో మట్టి కొట్టారు – వైఎస్ షర్మిల

-

ప్రజాప్రస్థానంలో భాగంగా 193వ రోజు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం రాఘవపేట్ నుంచి పాదయాత్రని ప్రారంభించారు. రాఘవపేట్ నుండి మల్లాపూర్ మండల పరిధిలోని హుస్సేన్ సాగర్, ముత్యంపేట మీదుగా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఈ పాదయాత్ర చేరుకుంది. అక్కడ మూసివేసిన చెరుకు ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద వైఎస్ షర్మిల మహా ధర్నా చేపట్టారు.

 

ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. చెరుకును పండించి చక్కెరను అందించి నోట్లు తీపి చేసిన చెరుకు రైతులకు ఎన్నికల ముందు ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ గెలిచిన తర్వాత ఫ్యాక్టరీని పట్టించుకోకుండా చెరుకు రైతుల నోట్లో మట్టి కొట్టారని సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. అధికారంలోకి వచ్చిన తదుపరి 100 రోజులలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఎటుపోయిందని ప్రశ్నించారు. ఈ ధర్నాలో చెరుకు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news