జగనన్న గారి కానుక’ అనేకంటే కూడా ‘మోదీ – జగనన్న గారి కానుక ‘ అంటే బాగుంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు – 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాబట్టి ఈ విద్యా కానుక పధకానికి ఆ పేరు సరిపోతుందని ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఈరోజు అమరావతి ప్రాంతంలో కన్ను మూసిన ఒక రైతు మరణం మీద కూడా అయన స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత రైతుల పక్షాన నిలిచిన పులి చినలాజర్ కన్నుమూయడం బాధాకరమన్న ఆయన రాజధాని కోసం ఆయన తన భూములు కూడా ఇచ్చారని అన్నారు. భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు న్యాయమైన వాటా దక్కాలని పోరాడిన నాయకుడాయన అని పేర్కొన్న పవన్ లాజర్ సమస్యను విశ్లేషించి, సరైన పరిష్కారం సూచించేవారని అన్నారు. రైతులకు న్యాయం జరగాలని తొలి నుంచీ పోరాడిన నాయకుడు లాజర్ అని పవన్ అన్నారు. 300 రోజులకు చేరిన ప్రస్తుత ఉద్యమాన్ని రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయడమే లాజర్ కు సరైన నివాళి అని పవన్ పేర్కొన్నారు.