సినిమాల్లోకి పూరీ ముద్దుల కూతురు..రొమాంటిక్ హీరో క్లారిటీ..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు నిర్మాత‌ల వార‌సులు ఎంట్రీ ఇవ్వ‌డం కామ‌న్. ఈ నేప‌థ్యంలో వ‌య‌సు వ‌చ్చిందంటే చాలు వార‌సుల ఎంట్రీ ఎప్పుడు ఉండ‌బోతుందంటూ ప్ర‌శ్న‌లు మొద‌ల‌వుతుంటాయి. అలాంటి ప్ర‌శ్న‌లే ఇప్పుడు క్రేజీ డైరెక్ట‌ర్ పూరీజ‌గ‌న్నాత్ వార‌సులకు ఎదుర‌య్యాయి. పూరీ జ‌గ‌న్నాత్ తన‌యుడు ఆకాష్ పూరీ ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్ గా ఆకాష్ రొమాంటిక్ అనే సినిమాలో న‌టించ‌గా ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. దాంతో సినిమా ప్ర‌మోష‌న్స్ లో ఆకాష్ ఫుల్ బిజీగా ఉన్నాడు.

కాగా ఆకాష్ ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మీ సోద‌రి సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇవ్వ‌బోతుంటూ ప్ర‌శ్నించ‌గా ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పారు. అస‌లు త‌న సోద‌రి ప‌విత్ర పూరీకి న‌ట‌న‌పై ఆస‌క్తిలేద‌ని చెప్పాడు. అంతే కాకుండా బుజ్జిగాడు సినిమా కోసం నాన్న ఫోర్స్ చేయ‌డం వ‌ల్లే నటించింద‌ని స్ప‌ష్టం చేశాడు. కానీ నిర్మాత‌గా ఎంట్రీ ఇవ్వాల‌ని ప‌విత్ర కోరుకుంటుందని ఆకాష్ త‌న సోద‌రి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆకాష్ చేసిన కామెంట్ల‌తో త్వ‌ర‌లోనే పూరీ జ‌గ‌న్నాత్ త‌న‌య నిర్మాత‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంద‌ని అర్థం అవుతోంది.