పవన్ “బ్రో” మొదటి వారం కలెక్షన్ లు రూ. 122 .96 కోట్లు

-

పవన్ కళ్యాణ్ మరియు సాయి తేజ్ లు నటించిన చిత్రం బ్రో సినిమా ఇంకా థియేటర్ లలో ప్రదర్శితం అవుతోంది. ఈ సినిమా తమిళ్ రీమేక్ గా విడుదలయి సంచలన విజయాన్ని అందుకుంది. తమిళ్ దర్శకుడు మరియు నటుడు అయిన సముద్రఖని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా సక్సెస్ తో పాటు వివాదాలను సృష్టించింది. ఇప్పటికీ వివాదాల కారణంగా బ్రో కు ప్లస్ అయింది అనుకోవాలి. కాగా వారం రోజుల కలెక్షన్ ల వివరాలు ఇప్పుడే విడుదల అయ్యాయి. ఈ వారం రోజుల్లో బ్రో సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.122 .96 కోట్లు వసూలు అయ్యాయి. కేవలం నిన్న ఒక్క రోజు మాత్రమే రూ. 4 .23 కోట్లు వచ్చినట్లు సినిమా వర్గాలు చెబుతున్నాయి.

ఇంకా రానున్న రెండు రోజులు వీకెండ్ కావడం వలన కలెక్షన్ లు పెరిగే అవకాశం ఉంది. ఈ కలెక్షన్ లలో కేవలం తెలుగు రాష్ట్రాలలో రూ. 91 .13 కోట్లు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version