‘ నాయనా పవన్ కల్యాణ్ ‘ అంటూ ఫాన్స్ అసంతృప్తి ?

-

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇది కాక మరో నాలుగు సినిమాలు లైన్ లో పెట్టారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు రావడంతో పవన్ కళ్యాణ్…వ్యవహరిస్తున్న తీరు ఆయన ఫ్యాన్స్ ని చికాకు పెట్టిస్తున్నాయి. విషయంలోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నాదెండ్ల మనోహర్.దీంతో మామూలు సమయంలో జనసేన పార్టీ తరఫున ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డ పవన్ అసలైన టైములో లేక పోవటం పట్ల అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇంకెందుకు నువ్వు రాజకీయాల నుండి వెళ్ళిపో…పార్టీ మొత్తం నాదెండ్ల మనోహర్ చేతిలో పెట్టి సర్దుకోవడం బెటర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

కీలకమైన ఈ టైంలో కూడా సినిమాలు చేయడం అంటే దీనికన్నా బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. మరోపక్క నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కార్యకర్తల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పార్టీలో టాక్. ఈ విధంగానే జనసేన పార్టీ ముందుకు వెళితే ఖచ్చితంగా క్లోజ్ అయ్యే పరిస్థితి దగ్గరలో ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version