రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు.  రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమని ఆయన అన్నారు. ఇక వరద సమస్యల గురించి మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు, ఇసుక, మట్టి తవ్వకాలతో వరద నీరు చేరడం, తుఫాను సమయంలో అధికారులు ప్రజలని పెద్దగా పట్టించుకోకపోవడం బాదేసిందని అన్నారు. కృష్ణా జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం కదిలించిందని వరసగా మూడు సార్లు రైతులు నష్టపోయారని అన్నారు. ఎకరాకి రూ.35వేలు ప్రకటింఛి పదివేలు వెంటనే ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వద్ద డబ్బులున్నా పట్టించుకోవడం లేదన్న ఆయన ప్రెసిడెంట్ మెడల్ అనే పేరుతో పాటు సీఎం మెడల్, వైసీపీ మెడల్ అనే పేర్లుతోనూ మద్యం అమ్మండి అలాగైనా జనాన్ని ఆదుకోండని కోరారు. ఏపీకి రూ.16వేలు కోట్లు మద్యం అమ్మకాలపై వస్తుందన్న ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అరవై డివిజన్లలో పోటీ చేయాలని భావించాం ఓట్లు పక్కకి పోకూడదనే బీజేపీకి సపోర్టు చేశామని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఫలితాలతో అర్ధమైందని ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీపై బిజేపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version