యువత సినిమాను, రాజకీయాలను వేరు చేసి చూడాలి : పవన్‌

-

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర సందర్భంగా కాకినాడలో బహిరంగ సభ నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ యువతను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. యువత సినిమాను, రాజకీయాలను వేరు చేసి చూడాలని పిలుపునిచ్చారు. తాను కోరుకునేది ఇదేనని తెలిపారు. సినిమాల్లో ఉండే అభిమానం వేరు, రాజకీయం వేరు అని స్పష్టం చేశారు. నన్ను చంపేస్తామని రకరకాలుగా బెదిరిస్తుంటారు… అయినప్పటికీ ప్రజల కోసం దశాబ్దకాలంగా పాటుపడుతున్నానని వెల్లడించారు. యువత కులాన్ని దాటి చూడకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇతర హీరోల అభిమానులు కూడా నాకు అండగా నిలవాలి. మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రామ్ చరణ్, రవితేజలను నేను కూడా అభిమానిస్తాను. చిత్ర పరిశ్రమ అంటే నేనొక్కడినే కాదు… మేం అందరం కలిస్తేనే చిత్ర పరిశ్రమ. మహా అయితే నేను ఏడాదికి ఒకట్రెండు సినిమాలు చేస్తానేమో. ఇవాళ హీరోలందరి అభిమానులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి జనసేనకు మద్దతు ఇవ్వండి. భవిష్యత్తు కోసం ముందడుగు వెయ్యండి” అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version