మనం గెలిస్తేనే అధికారంలో భాగస్వామ్యం కాగలం : పవన్‌

-

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ది ధైర్యం అనుకుంటారని, కానీ అది పిచ్చ అని వ్యాఖ్యానించారు. జగన్ మానసిక స్థితి బాగాలేదని, కేంద్రం ప్రత్యేక మానసిక వైద్యులను పంపించాలని వ్యంగ్యం ప్రదర్శించారు. పవన్ ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశంతో ఎలా అధికారం పంచుకుందాం..? అది సీఎం స్థానమా..? లేక మంత్రులా..? ఇవన్నీ ఆలోచించే ముందు మనం గెలవాలి కదా..? అని అన్నారు పవన్‌ కల్యాణ్‌.

అంతేకాకుండా.. ‘మనం గెలిస్తేనే అధికారంలే భాగస్వామ్యం కాగలం. పగటి కలలు కనొద్దు.. ముందు జగన్ను రాష్ట్రం నుంచి తరిమేయాలి. జగన్ను రాష్ట్రం నుంచి తరిమేశాక పవర్ షేరింగ్ గురించి ఆలోచిద్దాం. టీడీపీతో సమన్వయం చేసుకునే బాధ్యత నాదెండ్లకు అప్పజెబుతున్నాం. సమన్వయ కమిటీ అధ్యక్షునిగా నాదెండ్ల. జనసేన ఎన్డీఏలోనే ఉంది.

మనం బీజేపీతోనే ఉన్నాం.. ఈ విషయం తాలా గట్టిగా చెప్పండి. 2009 నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు.. 2024లో సాకారం కాబోతోంది. సింహం సింగిల్ అంటూ తొడలు కొడుతున్నారు.. తొడలు వాస్తాయి. అధికారులు ఆలోచించుకోవాలి.. ఆరు నెలల్లో మా ప్రభుత్వం వస్తోంది. మేం విసిగిపోయాం.. గొడవే కావాలంటే మేమూ సిద్దమే. రాబోయే జనసేన-టీడీపీ-బీజేపీ ప్రభుత్వానికి మద్దతివ్వాలి. తెలంగాణలో మనం పోటీ చేయాలి. ఎలా పోటీ చేయాలి.. ఎవరితో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది ఆలోచిద్దాం. ప్రధానిని.. అమిత్ షాను ఉద్దేశించి సమావేశం చివర్లో ఇంగ్లిషులో ప్రసంగించిన పవన్. భారత్ ప్రధానిగా మోడీని మళ్లీ చూడాలనుకుంటున్నా. మేం ఎన్డీఏతోనే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో గెలిచే మా ఎంపీలంతా ఎన్డీఏలోనే ఉంటారు.. ఇది నా ప్రామిస్. ఏపీకి మోడీ, అమిత్ షా ఆశీస్సులు కావాలి. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు. ఏపీ రాజధాని అమరావతిని వరల్డ్ క్లాస్ క్యాపిటలుగా తీర్చిదిద్దేలా కేంద్రం సహకారం అవసరం. మూడు రాజధానులు కాకుండా.. మూడు ప్రాంతాల అద్భుత అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం.’ అని అన్నారు పవన్‌ కల్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version