తెలంగాణలా ఉత్తరాంధ్రను దోచేయడం ప్రారంభించారు : పవన్‌

-

విశాఖ భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ మీడియాత మాట్లాడుతూ.. ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపద దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు ఇప్పుడు 292 ఎకరాలే మిగిలాయన్నారు. జాతీయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో బఫర్ జోన్ ఏర్పాటు చేయాలన్నారు పవన్‌ కల్యాణ్‌. వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) వరకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. 48 గంటల లోపు పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు పవన్.. ఎర్రమట్టి దిబ్బల చుట్టూ కనీసం 30 ఎకరాల బఫర్ జోన్ తో ఫెన్సింగ్ చేయాలని పవన్‌ వ్యాఖ్యానించారు. లేదంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు. టూరిజం మంత్రి సమక్షం లోనే అక్రమాలు జరుగుతున్నాయని, ఎర్రమట్టి దిబ్బల సమీపంలో మట్టి తవ్వడానికి వీ ఎం అర్ డీ ఏ కు ఏమి అవసరం? కలెక్టరేట్ దీనిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 1200 ఎకరాలను మొదట నేవీ కి ఇస్తే చివరకు 292 ఎకరాలు మిగిలిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక అవి కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఎర్రమట్టి దిబ్బలు జాతీయ సంపద అని, తెలంగాణా లా ఉత్తరాంధ్ర ను దోచేయడం ప్రారంభించారని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version