నేరగాళ్లు రాజకీయనేతలుగా మారి చట్టాలు చేస్తున్నారు : పవన్‌

-

ఎట్టకేలకు.. విశాఖ నుంచి తీవ్ర పరిణామల నేపథ్యంలో మంగళగిరి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఎందుకు పెట్టానంటే క్రిమినల్ పాలిటిక్స్ తనకు నచ్చవని, నేరగాళ్లు రాజకీయనేతలుగా మారి చట్టాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్ లు ఇలాంటి క్రిమినల్స్ కు సలాం కొడుతుంటే దేశం ఈ స్థాయికి దిగజారిపోయిందా? అనిపిస్తుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇలాంటి క్రిమినల్స్ నన్ను పరిపాలించకూడదని నేను భావిస్తానని, అందుకు నేనేం చేయాలని భావించి ఓ బలమైన ఆశయంతో జనసేన పార్టీ స్థాపించానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. జైల్లో తమను బెల్టులతో కొట్టారని, మోకాళ్లపై నడిపించారని మా నేతలు చెప్పారు. మా మహిళా నేతలను కొట్టారు. అసభ్యకర పదజాలం ఉపయోగించారు ఇలాంటి చర్యల ద్వారా మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు.

ఈ మంగళిగిరి ప్రెస్ మీట్ నుంచి వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నాను. మేం ఇంకా బలంగా పోరాడతాం, ఏం చేస్తారో చేసుకోండి… నోరు జారే ప్రతి వైసీపీ నేతకు చెబుతున్నా… దీనిపై మీరు బాధ్యత వహించాలి. ఉత్తరాంధ్రపై వీళ్లకు ప్రేమ అంటారు… భోగాపురం భూములపై అప్పటి ప్రభుత్వంపై కేసు వేయాలని బాధితులకు సూచించి, ఇప్పుడవే భూములను వాళ్లనుంచి లాగేసుకుంటున్నారు. ఇవ్వకపోతే బెదిరింపులు! దసపల్లా భూముల్లోనూ ఇలాగే చేశారు. సైనికులకు సంబంధించిన 71 ఎకరాలు మంత్రి ధర్మాన, ఆయన మనుషులు కాజేశారని ఆరోపణలు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version