రామ మందిరం నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ఎంతిచ్చాడంటే..?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమాలూ తెరకెక్కిస్తున్నాడు. అటు ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా ఉంటూనే వెండితెర మీదా తళుక్కుమంటున్నాడు. ఐతే పవన్ కళ్యాణ్ సేవాభాగం గురించి అందరికీ తెలిసిందే. అడిగిన వాళ్ళకి కాదనకుండా ఎంతో కొంత సాయం చేసే పవన్ కళ్యాణ్, అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర నిర్మాణానికి తన వంతుగా 30లక్షలు ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జనసేన పార్టీ తరపున ప్రకటన కూడా వెలువడింది.

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి నుండి సామాన్య పౌరుడి వరకు తమకు తోచినంత ఇస్తున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, 30లక్షలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ సమ్మర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. మిగిలిన మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. అదీగాక మరో చిత్రానికి ఓకే చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news