శరవేగంగా పవర్ స్టార్ సినిమాల షూటింగ్స్..మేకర్స్ ప్లానింగ్!

-

జనసేనాని పవన్ కల్యాణ్ ఈ ఏడాది దసరా తర్వాత ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ లోపలే వీలయినంత వరకు సినిమాల షూటింగ్స్ త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మూవీ మేకర్స్ కు పవర్ స్టార్ తెలిపారని కూడా టాక్.

ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ దాదాపుగా సగం కంటే ఎక్కువ భాగం పూర్తయినట్లు వినికిడి. ఈ క్రమంలోనే ప్యారలల్ గా మిగతా భాగం షూటింగ్ కోసం ప్లాన్ చేసుకోవాలని పవన్ సూచించారట. ఆ లోపు హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారని టాక్.

మొత్తంగా పవన్ కల్యాణ్ వరుస సినిమాలు త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమచారం అందుతోంది. మరో వైపున పాన్ ఇండియా ప్రాజెక్టు ‘హరి హర వీరమల్లు’..పైన అంచనాలు పెరిగిపోతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్..డెఫినెట్ గా ఈ ఏడాది చివరి కల్లా పూర్తవుతుందని పలువురు సినీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version