నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా : పవన్‌

-

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే లీడర్ అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు పవన్ కల్యాణ్. ”తెలంగాణ రాష్ట్రం వచ్చాక నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా? అందరికీ చేరాయా అన్నది ప్రశ్నగా మారింది. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదు. మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోదీ అనుభవం ప్రధానిగా దేశానికి ఎంత ఉపయోగ పడుతుందో అందరికీ తెలుసు. ప్రధాని మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉంటే.. ఆర్టికల్ 370 రద్దు చేసే వారే కాదు, ట్రిపుల్ తలాక్ రద్దు చేసే వారు కాదు, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చే వారు కాదు, రామ మందిరం నిర్మించే వారు కాదు, పెద్ద నోట్లను రద్దు చేసే వారే కాదు అని అన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గాయన్నారు. తనలాంటి కోట్లాదిమంది కన్న కలలకు ప్రతిరూపమే మోదీ అన్నారు. అంతర్జాతీయస్థాయిలో భారత్‌ను ప్రధాని అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ధైర్యం నింపిన వ్యక్తి అన్నారు. అలాంటి ప్రధానికి తాము అండగా ఉంటామన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయని ఎన్నికల ప్రయోజనాలు కాదన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారన్నారు. ఔర్ ఏక్ బార్ మోడీ అంటూ నినదించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version