ఎస్బీఐ లో స్పెషలిస్ట్ క్యాడర్‌ పోస్టులు..రాతపరీక్ష లేకుండా ఎంపిక..

-

భారతీయ ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోని పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.స్పెషలిస్ట్ క్యాడర్‌ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక,జీతాలు మొదలగు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మొత్తం ఖాళీల సంఖ్య: 35

పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్లు పోస్టులు

ఖాళీల వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులు

విభాగాలు: ఐటీ (టెక్నికల్‌ ఆపరేషన్స్‌, ఇన్‌బౌండ్‌ ఇంజినీర్‌, ఔట్‌బౌండ్‌ ఇంజినీర్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌, నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, సైట్‌ ఇంజినీర్‌ కమాండ్‌ సెంటర్‌, స్టాటిస్టీషియన్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌/విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌/కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్స్‌ ఇంజనీరింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.750
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 12, 2022.
ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version