జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న విద్యా కానుక పథకం పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. జగనన్న విద్యా కానుక పథకం కేవలం ప్రచార ఆర్భాటాలు కోసం మాత్రమే అంటూ టిడిపి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే… కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొని కేంద్రం పేరు ప్రస్తావించకపోవడం పై తప్పు పడుతుంది జనసేన పార్టీ. ఇక ఇటీవల జగనన్న విద్య కానుక పథకం పై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగనన్న విద్యా కానుక పథకంలో ఏకంగా కేంద్ర నిధులు 60% వాటా ఉన్నాయి అంటూ తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగనన్న విద్యా కానుక అనేకంటే మోదీ జగనన్న విద్యా కానుక అంటే ఇంకా బాగుండేది అంటూ సెటైర్లు వేశారు. జగనన్న విద్యా కానుక పథకం లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేస్తోంది అంటూ తెలిపారు. అంతేకాకుండా జగనన్న విద్యా కనుక కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత వాటా నిధులు ఇస్తుంది అనే విషయాలను అందరికీ తెలిసే విధంగా వివరాలు వెల్లడించాలని అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.