ఏపీ రాజకీయాల్లో కౌత్త ఈక్వేషన్ను తెర మీదకు తీసుకువచ్చిన పవన్

-

ఏపీ రాజకీయాల్లో కౌత్త ఈక్వేషన్ను తెర మీదకు తీసుకువచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. నేను కాపు నాయకుడిని కాదని, నేను కుల ఫీలింగుతో పెరగలేదు.. మానవత్వంతో పెరిగానని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘ కాపు రిజర్వేషన్లపై కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం. ఈ కాంబినేషన్ ఉంటే ఎవ్వర్నీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే.. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. బీసీలంటేనే ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి లేకుంటే సమాజమే లేదు.

బీసీలంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్. బీసీలకు ఇన్ని ఇచ్చాం.. ఇన్ని పదవులిచ్చాం అని పార్టీలు చెప్పుకుంటున్నాయి. బీసీ కులాలకు సంఖ్యా బలం ఉన్నా దేహి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది..? బీసీల అనైక్యతే మిగిలిన వారికి బలం. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యత. పూలేను గౌరవించింది మనమే. బీసీ సదస్సు అంటే ఇంత మంది వచ్చారు.. కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? గత ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీపీఐ అడడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు. నేను బీసీల కోసం నిలబడతాను.’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version