కానిస్టేబుల్‌ అభ్యర్థుల అభ్యంతరాల నివృత్తి కోసం ఎల్లుండి వరకే సమయం

-

ఇటీవల తెలంగాణ స్టేల్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్టు కానిస్టేబుల్‌ తుది ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అభ్యంతరాల నివృత్తికి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసు నియామక మండలి(TSLPRB) అక్టోబర్ 7 సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం కల్పించింది. అభ్యర్థులు పర్సనల్ లాగిన్ ఐడీ ద్వారా అభ్యంతరాల నివృత్తి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఫీజు రూ.2,000గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000గా నిర్ణయిచింది.

దరఖాస్తు చేసిన వారికి కొద్ది రోజుల్లోనే సమాధానాలు అందుతాయని TSLPRB వెల్లడించింది. ఇందు కోసం : https://www.tslprb.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది. తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామక పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్ తుది ఫలితాలను పోలీసు నియామక మండలి (TSLPRB) ప్రకటించింది. 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను పోలీసు నియామక మండలి ఎంపిక చేసింది. సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాలు అక్టోబర్ 5 ఉదయం నుంచి https:// www.tslprb.in/ సైట్లో అందుబాటులో ఉంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version