‘జార్జి రెడ్డి’ కోసం రాబోతున్న పవన్ కళ్యాణ్….!!

-

గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తరువాత పూర్తిగా రాజకీయాలకు మాత్రమే పరిమితం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అతి త్వరలో మళ్ళి సినిమా రంగ ప్రవేశం చేయనున్న విషయం తెలిసిందే. ఆయన నటించబోయే తదుపరి 26వ సినిమా అధికారిక ప్రకటన కూడా ఇటీవల రావడం జరిగింది. ఇక మధ్య మధ్యలో మాత్రం కొన్ని ముఖ్యమైన సినిమా ఫంక్షన్లకు ఆయన హాజరవుతున్నారు. ఇటీవల తన అన్నయ్య చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఆడియో ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పవన్, ఈనెల 17న ‘జార్జి రెడ్డి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.
1965-75 ప్రాతంలో హైదరాబాద్ లోని ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగి పలు ఉద్యమాల్లో పాల్గొని గొప్ప నాయకుడిగా పేరుగాంచిన జార్జి రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అధికారిక ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని పవన్, తన సన్నిహితులతో చెప్పినట్లు ఇటీవల వార్తలు కూడా రావడం జరిగింది. ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ సినిమా నిర్మాతలు ఈనెల 17న జరుగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించడం, దానికి ఆయన ఒప్పుకోవడం జరిగిందని అంటున్నారు.
 ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించగా ఈనెల 22న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక పవర్ స్టార్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాబోతుండడంతో, తప్పకుండా తమ సినిమాకు ఆయన రాక పబ్లిసిటీ పరంగా కొంత హెల్ప్ అవడం ఖాయం అని సినిమా యూనిట్ భావిస్తోందట….!!

Read more RELATED
Recommended to you

Latest news