గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం “వారాహి” పై చర్చ నడుస్తోంది. ఆర్మీ కలర్ లో వారాహి రంగు ఉండడం వివాదానికి కారణమైంది. వారాహి రంగు పై ఏపీలో అధికార పార్టీ నేతలు నేరుగా విమర్శలు చేశారు. అది వారాహి కాదని నారాహి అని.. ఆలీవ్ గ్రీన్ రంగు కాకుండా పసుపు కలర్ వేసుకోవాలని చురకలంటించారు. అయితే ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఎన్నికల వాహనం వారాహికి రిజిస్ట్రేషన్ కు అనుమతి లభించడం.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి కావడం జరిగిపోయింది.
ఈ విషయాన్ని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాపారావు స్వయంగా వెల్లడించారు. ఈ వాహనానికి రవాణా శాఖ చట్టం ప్రకారం అన్ని నిబంధనలు ఉన్నాయని.. వారాహి రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ కు చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేనందున వారాహి వాహనం రిజిస్ట్రేషన్ చేశామని.. రిజిస్ట్రేషన్ నెంబర్ TS13EX 8384 అని తెలిపారు.