ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సాలరీ సరిపోవడం లేదని డబ్బులని సంపాదించేందుకు వివిధ మార్గాలని ఎంచుకుంటున్నారు. చిన్న వ్యాపారాలని మొదలు పెట్టడం, సాగు చేయడం, డెలివరీ బాయ్ గా పని చేయడం ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తున్నారు. అయితే మీరు కూడా ఏదైనా ఖాళీ సమయంలో చేయాలని చూస్తున్నారా..?
దాని నుండి మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వండి. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన మంచి డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ ఉండదు. ఈజీగా మీరు దీన్ని ఫాలో అయ్యి డబ్బులని సంపాదించుకోవచ్చు. తేనె కి వున్న డిమాండ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తేనె ని చాలా మంది కొంటూ వుంటారు. వీటి ద్వారా ఇతర ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చెయ్యచ్చు. రాయల్ జెల్లీ, పుప్పొడి లేదా తేనెటీగ జిగురు వంటి వాటి ద్వారా కూడా మీరు సంపాదించచ్చు.
పెద్దగా పెట్టుబడి పెట్టవలసిన పనే లేదు. ప్రభుత్వం మీకు సబ్సిడీని కూడా ఇస్తోంది. దీన్ని మీరు స్టార్ట్ చేస్తే ప్రతి నెలా లక్షల రూపాయలు వస్తాయి. ఈ వ్యాపారం చెయ్యాలంటే తేనెటీగల కోసం స్నేహపూర్వక వాతావరణాన్ని మీరు ఏర్పాటు చెయ్యాలి. వీటి కోసం మీరు కృత్రిమ వాతావరణం నిర్మించాలి. శిక్షణ తీసుకోవాలి. అప్పుడు తేనెటీగల పెంపకం ఈజీ అవుతుంది. తేనెటీగల కోసం ఒక కాలనీని మొదలు పెట్టాలి. వ్యాపార లైసెన్స్ ఉండాలి. ఈ వ్యాపారం కోసం ప్రభుత్వం మీకు 85% వరకు సబ్సిడీని ఇస్తుంది. నెలకు రూ.50 వేలు.వరకు వీటి నుండి వస్తాయి.