అందువల్లే నాకు ప్రభాస్ కు మధ్య సంబంధం ఉందని కథనాలు వచ్చాయి.!

-

పాన్‌ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ సరసన కృతి సనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని గ్రాఫిక్ వర్క్ పెండింగ్ లో ఉంది. ఇక ఒక ఇంటర్వ్యూ సందర్బంగా కృతి సనన్‌ ఆది పురుష్ సినిమా గురించి అలాగే  ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తల పై క్లారిటీ ఇచ్చింది.

ఇంటర్వ్యూ లో బాగంగా ప్రభాస్ నేను కలిసి నటించిన ఆదిపురుష్‌’ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని తెలిపింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడి నటించాను అని తెలిపింది. ఇక ప్రభాస్ గురించి చెబుతూ ఆయన పాన్ ఇండియా స్టార్ అయినా కూడా చాలా సాదారణ మనిషి లా ఉంటారని అలాంటి వారిని నేను బాలివుడ్ లో చూడలేదని తెలిపింది.ఇక తన మర్యాద, భోజనం వేరే లెవెల్ లో ఉంటాయని తెలిపింది.

ఇక కృతిసనన్‌ ప్రభాస్ కు నాకు మధ్య ఉన్న సంబంధం ఉందనే గాసిప్స్ పై మాట్లాడుతూ నాకు ప్రభాస్ కు మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే అని చెప్పింది. అలాగే ఈ గాసిప్స్ ఎందుకు వచ్చాయో కూడా చెప్పింది.నేను ప్రభాస్ షూటింగ్ టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ‘ఆదిపురుష్‌’ సెట్‌లో ఆయన నాకు తెలుగు నేర్పించారు. నాకు తెలుగు నేర్పించినందుకు ప్రతిగా నేను ప్రభాస్‌కు హిందీ నేర్పించాను. ఇలా బాగా దగ్గరగా ఉండి మాట్లడుతూ ఉండే సరికి అందరూ అపార్థం చేసుకొని గాసిప్స్ రాశారు. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. ప్రభాస్‌ మంచి మనసున్న వ్యక్తి. అందరితో స్నేహంగా ఉంటారు’ అని చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version