ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మద్యాన్ని సమూలంగా నిలిపివేస్తామని మానిఫెస్టోలో పెట్టాడు, అయినా దానిని ఆచరణలో పెట్టడం కుదరడం లేదు. తాజాగా భీమవరం మీటింగ్ లో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. ఇప్పుడు మనకున్న సీఎం అప్పుడేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడేమో అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతూ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నాడు అంటూ రెచ్చిపోయి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం లాంటి ఆచారం సాధ్యం కానీ మాట్లాడు చెప్పం. కానీ ఇంతకు ముందు లాగే మళ్ళీ పాత ధరలకు మద్యాన్ని అమ్మేలా చర్యలు తీసుకుంటాము అని చెప్పాడు పవన్ కళ్యాణ్.
పాత ధరలకే మద్యాన్ని అమ్ముతాం: పవన్ కళ్యాణ్
-