మోడీకి పవన్ “తియ్యని లడ్డూ” గిఫ్ట్!

-

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. జనాలు అన్నీ గమనిస్తున్నారని మరిచి చేస్తోన్న రాజకీయం గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఏదో సంచలనం సృష్టిస్తారని చాలామంది భావించారు! కానీ… అనతికాలంలోనే వారి అంచనాలకు తలక్రిందులు చేస్తూ పవన్ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రధానమంత్రి మోడీపై పవన్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. గతం మరిచిపోయిన పవన్ కు ఇప్పుడు అన్నీ తీయగా అనిపిస్తున్నాయా అంటూ కామెంట్లు మొదలైపోయాయి!

వివరాళ్లోకి వెల్తే… కేంద్రంలో బీజేపీ రెండో దఫా అధికారంలోకి రావడం నరేంద్రమోడీ ప్రధానిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న తరుణంలో పవన్ ఓ ట్వీట్ చేశారు. “మోడీ ఏడాది పాలనలో అనేక చారిత్రత్మాక నిర్ణయాలు వెలువడ్డాయని.. భారతదేశం తన ప్రత్యేకతను చాటుకుందని.. స్వయం సమృద్ధి సాధించిన భారతదేశం 21వ శతాబ్ధంలో ఆయన సారథ్యంలో ఈ ఘనతను నిలబెట్టుకుంటుందని కొనియాడారు” ఇందులో నరేంద్రమోడీని సైతం ట్యాగ్ చేశారు పవన్!

నరేంద్ర మోడీ ఏడాది పాలనపై పలు భిన్నాభిప్రాయాలు ఉన్న తరుణంలో… గతాన్ని మరిచి పవన్ కురిపించిన ఈ ప్రశంసల పరంపర సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ఎంత రాజకీయ పొత్తులు పెట్టుకుంటే మాత్రం రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. దానిపై తాను గతంలో చూపించిన ఆగ్రహం.. అందుకు చేసిన శపథం.. అన్నీ మరిచిపోతే ఎలా? ఇప్పుడు పవన్ కు ఎదురవుతున్న ప్రశ్నలు ఇవే! “ఏపీకి ప్రత్యేక హోదా కోసం తుది దాకా పోరాడుతాను” పవన్ గత ఏడాది చేసిన ఓ వ్యాఖ్యను ఇప్పుడు ఏపీ వాసులు గుర్తుచేసుకుంటున్నారు! ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తే “పాచిపోయిన లడ్డూ”ఇచ్చారని పవన్ చేసిన వ్యాఖ్య అప్పట్లో హాట్ టాపిక్.

కాకపోతే అది గతం! నాడు మోడీ పై ఆస్థాయిలో కామెంట్లు చేసిన పవన్… పొత్తుమైకంలో అవన్నీ మరిచిపోయి నేడు ఆ టాపిక్ తప్ప అన్నీ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. బీజేపీతో రాజకీయంగా పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్న… హోదా అంశాన్ని వదిలేశినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు జనం! ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్న ఆ లడ్డూలు కాస్త “తియ్యని లడ్డూలుగా” మారిపోయాయా అంటూ సెటైర్స్ వేస్తున్నారు! ఏది ఏమైనా… హోదా విషయంలో పవన్ తన స్టాండ్ ఏమిటన్నది కచ్చితంగా చెప్పి తీరాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పలువురి అభిప్రాయంగా ఉంది!!

Read more RELATED
Recommended to you

Exit mobile version