జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయనాలను శాసించే స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భగంగగానే వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తూ బహిరంగ సభలను పెట్టి ప్రభుత్వాన్ని మరియు జగన్ ను తీవ్రంగా విమర్శించిన తీరును మనము చూశాము. ఇప్పటి వరకు మూడు విడుతలలో వారాహి యాత్రను పూర్తి చేసిన పవన్ కొంతమేరకు ప్రజలకు చేరువయ్యాడనే చెప్పాలి. తాజాగా నాలుగవ విడుత వారాహి యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించి జనసైనికులలో నూతన ఉత్సాహాన్ని నింపాడు. కాగా ఈ నాలుగవ విడుత వారాహి యాత్ర కృష్ణా జిల్లా నుండి ప్రారంభం కానుంది, సెప్టెంబర్ 21వ తేదీ నుండి నాలుగు నియోజకవర్గాలలో 5 రోజుల పాటు ఈ యాత్రను కొనసాగించనున్నారు. ఈ నియోజకవర్గాలలో అవనిగడ్డ, పెడన, మచిలీపట్టణం, కైకలూరు లు ఉన్నాయి.
కాగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అన్న వార్తను ప్రకటించిన తర్వాత పెడుతున్న ఈ సభకు ఆయా నియోజకవర్గాల టీడీపీ నేతల నుండి ఎటువంటి సహకారం ఉండనుంది అన్నది తెలియాల్సి ఉంది.