RISING STAR : సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై నీలినీడలు

-

టీం ఇండియా లో అతి తక్కువ కాలంలో టీ 20 మరియు వన్ డే లలో సత్తా చాటి రెగ్యులర్ ఆటగాడిగా చోటు దక్కించుకున్న తక్కువమంది ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ ఒకరు. కానీ గత కొన్ని మ్యాచ్ లుగా సూర్య కుమార్ యాదవ్ ఆట చూస్తే మరీ తీసికట్టుగా తయారయింది. ఏదో చిన్న జట్ల మీద తన ప్రతాపాన్ని చూపిస్తూ జట్టులో చోటు నిలుపుకుంటున్నాడు. ఎంతోమంది యువ ఆటగాళ్లు టీం ఇండియాలో చోటు కోసం ఎదురుచూస్తుంటే… సూర్య కుమార్ యాదవ్ మాత్రమే వచ్చిన అవకాశాలను నేలపాలు చేసుకుని ప్రేక్షకులను చాలా నిరాశపరుస్తున్నాడు. ఇక గత రాత్రి బంగ్లాదేశ్ ఆడిన మ్యాచ్ లో ఇండియా కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయి చాలా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా జట్టు యాజమాన్యం తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రసిద్ధ కృష్ణ మరియు షమీ లకు అవకాశాలను ఇచ్చింది. కానీ తిలక్ వర్మ మరియు సూర్య ఫెయిల్ అయ్యారు..

తిలక్ వర్మ జూనియర్ ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది ..కానీ ఏందో అనుభవం ఉన్న సూర్య కు ఏమైంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అవుట్ అయ్యి జట్టు ఓటమికి తాను కూడా కారణం అయ్యాడు. మరి ఇలాగే ఆడితే సుర కెరీర్ ప్రమాదంలో ఉన్నట్లే.

Read more RELATED
Recommended to you

Latest news