కేసీఆర్ రాజ‌కీయ పోరాట యోధుడు.. ఆయ‌న‌కు ఆయ‌నే సాటి: ప‌వ‌న్ క‌ల్యాణ్

-

నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు 68వ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వేడుక‌లు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు పుట్టిన రోజు ఉత్స‌వాల‌ను జ‌రుపుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

గొప్ప వాక్పటిమ, ముందు చూపు కలిగిన రాజకీయ పోరాటయోధుడు సీఎం కేసీఆర్ అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతటి జటిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా.. తన మాటలతో ప్రజలకు సాంత్వన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి అని పవన్ కళ్యాణ్ చెప్పారు.

సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయన పైన పోరాటం కెసిఆర్ ను తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలుపుతూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version