కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మోహన్ బాబు తాజాగా నటించిన సినిమా సన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ మోహన్ బాబు తనపై ట్రోల్స్, మీమ్స్ చేస్తున్న వారిపై చాలా ఘాటుగా స్పందించాడు.
ట్రోల్స్, మీమ్స్ అనేవి నవ్వుకునేలా, సరదాగా ఉండాలి తప్ప వ్యక్తులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోల్స్, మీమ్స్ ను ఎక్కువగా పట్టించుకోను. నాకు ఎవరైనా పంపిస్తే చూస్తాను. ట్రోల్స్, మీమ్స్ ను నిజానికి అయితే పట్టించుకోకూడదు. కాకపోతే ట్రోల్స్, మీమ్స్ హద్దులు మీరు తున్నాయి. వాటిని చూసినప్పుడు బాధగా అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులను ట్రోలింగ్ చేయొచ్చు లేదో నాకు తెలియదు కానీ, వ్యగ్యంగా ట్రోలింగ్ చేయడం మాత్రం చాలా బాధాకరం.
ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడాని నియమించుకుని ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఆ వ్యక్తులకు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒకరోజు వారు శిక్షను అనుభవిస్తారు. అలాంటి సమయంలో వారి వెనక ఎవరూ ఉండరు. వారికి ఎవరు సహాయం చేయరు అని మోహన్ బాబు అన్నారు.