పేటీఎం సీఈఓ ఓ కీలక ప్రకటన చేశారు. పేటియం వ్యవస్థాపకుడు సీఈఓ విజయ్ కుమార్ శర్మ ఫిబ్రవరి 29 తర్వాత కూడా యాప్ పనిచేస్తుంది అని చెప్పారు. తమకి మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. పేటీఎం బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ కి ఆర్బిఐ ఆంక్షలు విధించింది విషయం మనకి తెలుసు. కస్టమర్ అకౌంట్లు, వాలెట్లు, ఫాస్ట్ టాగ్స్ ఇలా ఇతర సాధనాల్లో టాప్ యాప్ లో లేదా డిపాజిట్లని అంగీకరించడానికి వీలులేదని ఆర్బిఐ చెప్పింది.
దీంతో పేటీఎం ఆదాయ మార్గాలు అన్నీ కూడా మూసుకుపోయాయి దీనిమీద సీఈవో విజయ్ శేఖర్ శర్మ క్లారిటీని ఇచ్చేశారు మాకు మద్దతు తెలిపిన ప్రతి పేటీఎం టీం మెంబెర్స్ కి ధన్యవాదాలు అని చెప్పారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందని అన్నారు ఫిబ్రవరి 29 తర్వాత కూడా యధావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగుతాయని అన్నారు.