కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక వ్యక్తి చేసిన పనికి సభ్య సమాజం తలదించుకుంటుంది. కిరాతకుడు చేసిన పనికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిహార్ లో జరిగిన దారుణమైన ఘటనను చూసి కోపంతో ఊగిపోతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఒక మానవ మృగం మేన కోడలిపై కన్నూ వేశాడు. మేన కోడలితో తన కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. మేన కోడలి పై అత్యాచారం చేశాడు. మేన కోడలు అద్దని వేడుకున్నా.. ఈ కిరతకుడు ఆగలేదు. ఆమె పై అతి దారుణంగా అత్యాచారం చేశాడు.
అంతటితో ఆగకుండా.. ఆ వ్యవహారాన్ని మొత్తాన్ని తన మొబైల్ లో వీడియో తీశాడు. ఈ వీడియోను.. తన మేన కోడలి భర్తకు చూపించాడు. అమ్మాయే తనను రెచ్చగొట్టి శృంగారంలో పాల్గొనేలా చేసిందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి తన భర్తకు విడాకులు తీసుకోవాలి ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ బాధితురాలు జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడంతో అసలు నిజం బయటకు వచ్చింది. బాధితురాలు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కిరాతకున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.