రాజాసింగ్ పై పీడీ యాక్ట్.. చర్లపల్లి జైలుకు తరలింపు

-

గురువారం మధ్యాహ్నం బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. రాజా సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు మంగళహాట్ పోలీసులు. రాజాసింగ్ పైరాజా సింగ్ పై 2004 నుంచి 101 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటిసారిగా ఒక ఎమ్మెల్యే పై పీడీ యాక్ట్ తొలిసారి నమోదయింది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసులు నమోదు కావడంతో రాజా సింగ్ పై పిడి యాక్ట్ నమోదు చేశామన్నారు సిపి సివి ఆనంద్.

చాలాసార్లు ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిపారు. ఇప్పటికే రాజాసింగ్ పై రౌడీషీట్ ఉన్నట్లుగా పేర్కొన్నారు సిపి సివి ఆనంద్. ఓ యూట్యూబ్ ఛానల్ లో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని.. మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ రాజాసింగ్ వ్యాఖ్యలు చేసినట్లుగా పేర్కొన్నారు. మత ఘర్షణలు చోటు చేసుకునేలా రాజా సింగ్ ప్రసంగాలు ఉన్నాయని అన్నారు సిపి ఆనంద్. పిడి యాక్ట్ నమోదు కారణంగా.. ఏడాది పాటు రాజాసింగ్ జైల్లోనే ఉండాల్సి రావచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version