విజయవాడలో కృష్ణమ్మ ఇప్పడిప్పుడే శాంతిస్తోంది. ప్రకాశం బ్యారేజికి వరద ఉధృతి నెమ్మదిగా తగ్గతూ వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.81 లక్షల క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటి మట్టం 13.5 అడుగులుగా ఉండగా..రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాగా,సోమవారం రికార్డుస్థాయిలో 11 లక్షల క్యూసెక్కులుగా పైగా ప్రవాహం రావడంతో బెజవాడ వాసులు వణికిపోయారు.
విజయవాడలో బుడమేరు వాగు పొంగిపొర్లడంతో పట్టణం నీటమునిగిన విషయం తెలిసిందే.లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. ఇంట్లోని సామాను పూర్తిగా తడిచిపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు.సామగ్రిని బయట పెట్టి ఆరబెట్టుకుంటున్నారు. సర్టిఫికెట్లు తడిచిపోవడంతో పలువురు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పుస్తకాలు ఆరబెట్టుకుంటున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.