అమ్మాజీ ఒక ప్రెస్ మీట్… రెండు లాభాలు!

-

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో వైకాపా నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. వారిలో ఇప్పటికే జగన్ రెండు సార్లు సీటు ఇచినా.. సద్వినియోగం చేసుకోలేకపోయిన బొంతు రాజేశ్వరరావు కాగా.. ఆయనపై ఉన్న అక్కసుతో కొందరు “బలమైన” వ్యక్తులు అనూహ్యంగా తెరపైకి తెచ్చారని నియోజకవర్గంలో గుసగుసలకు కారణమైన పెదపాటి అమ్మాజీ.. కాగా మరొకరు జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్!

వీరిలో బొంతు మీడియా ముందుకు ఈ మధ్యకాలంలో వచ్చింది లేదు.. బాగా అలగడం, అమ్మాజీ వచ్చిన ప్రతిచోటుకీ ఆయనవర్గం కూడా చేరడం అల్లరి చేయడం జరుగుతునే ఉంది! ఆయన ఆవేదనలోనూ న్యాయముందనే మాటలు కూడా నియోజకవర్గంలో వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో వీరిద్దరినీ వెనక్కి నెట్టి.. తాను వైకాపా ఎమ్మెల్యేని అని చెప్పుకునే స్థాయికి చేరిపోయారు రాపాక. గతకొన్ని రోజులుగా మీడియా ముందుకు వస్తూ… తాను జగన్ మనిషిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు! ఈ క్రమంలో మాల కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్న పెదపాటి అమ్మాజీ మైకులముందుకు వచ్చారు! YS

ఈ సందర్భంగా దళితులపై దాడులు – ప్రభుత్వ స్పందన.. చంద్రబాబు – హర్షకుమార్ ల అవకాశవాదం – దళితులపై దొంగ ప్రేమ అనే అంశాలపై మాట్లాడారు. ఫలితంగా దళితుల తరుపున బలమైన గొంతుకగా తాను మారుతున్నానని సంకేతాలు ఇవ్వడంతో పాటు… రాజోలు నియోజకవర్గంలో కూడా తన గురించి మాట్లాడుకునే స్థాయిలో… రాపాకను మించి వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు! ఈ విషయంలో అమ్మాజీ లాగిన లాజిక్కులు, బాబు కు వేసిన పంచులు సూపరంటున్నారు!

“హర్షకుమార్ ‌కు సరదాగా ఉంటే నక్షలైట్లలో చేరాలి. ఆయనతో పాటు చంద్రబాబు కూడా నక్సలైట్లలో చేరాలి. అంతే తప్ప దళిత యువకులను రెచ్చగొట్టవద్దు” అంటూ మొదలుపెట్టిన అమ్మాజీ… చంద్రబాబు దళితులను నీచంగా చూశారని.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. నాడు హర్ష కుమార్ ఎందుకు నోరు మెదపలేదని ఫైరయ్యారు! దళితుల కోసం మీడియా సమావేశం పెట్టానని చెప్పుకున్న హర్షకుమార్… మూడు రాజధానులు కోసం ఎందుకు మాట్లాడుతున్నారని అమ్మాజీ లాజిక్ లాగారు!

ఈ సమయంలో దళితులపై దాడులు జరిగిన విషయాన్ని అంగీకరిస్తూనే… .ఆ సంఘటనలపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించిన అంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత యువకుడి శిరోమండనం కేసులో.. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్‌ కు పంపారని.. వారిపై ఇఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అమ్మాజీ తెలిపారు. ఇదే క్రమంలో… దళిత బాలికపై హత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌ కు పంపారని.. ఇక ప్రకాశం జిల్లాలో దళిత యువకుడిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని అమ్మాజీ తెలిపారు.

ఏది ఏమైనా… ఒక్క ప్రెస్ మీట్ తో రెండు రకాల ఫలితాలు అమ్మాజీ పొందారని అంటున్నారు విశ్లేషకులు. అందులో ఒకటి దళితుల విషయంలో తాను బలమైన గొంతుకగా మారబోతున్నానని కాగా… రాజోలు నియోజకవర్గం విషయంలో తాను కూడ పోటీలో ఉన్నానని.. అని అంటున్నారు విశ్లేషకులు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version