టీఆర్‌ఎస్‌లో చేరతా.. బీజేపీ నచ్చలేదు ; పెద్దిరెడ్డి

బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అతి త్వరలోనే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లో చేరుతానని పెద్దిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. బీజేపీ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో పరిస్థితిలు తనకు నచ్చలేదని… ఆ పార్టీపై విమర్శలు చేయదలచు కోలేదని పేర్కొన్నారు.

ఈటల రాజేందర్‌ చేరిక విషయంలో తనకు గౌరవము ఇవ్వలేదని బీజేపీ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ప్రకటించారు. హుజురాబాద్‌ లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎవరైనా కానీ… వారి కోసం పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా… మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి కాసేపటి క్రితమే.. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన చేశారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ కు రాజీనామా లేఖ కూడా పంపారు.