ఇటీవల కాలంలో పెళ్లి చాలా మంది లేట్ ఏజెస్‌లో చేసుకుండటం మనం గమనించొచ్చు. ఇందుకు కారణాలు ఒక్కొక్కరికి ఒకోలా ఉండొచ్చు. ఇక ఏ వయసులో చేయాల్సిన ఆ వయసులో చేయాల్సిందేనని పెద్దలు చెప్తుండటం మనం గమనించొచ్చు. అయితే, మారిన పరిస్థితుల వల్ల అనుకున్న పని అనుకున్నట్లు జరగడం కొంచెం కష్టమే. ఇక పెళ్లి అనేది జనరల్‌గానే వ్యక్తిగతం. అమ్మాయి, అబ్బాయి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు భాగస్వాముల మధ్య అవగాహన, సాన్నిహిత్యం ముఖ్యం. కాగా, మ్యారేజ్ ఏ ఏజ్‌లో చేసుకుంటే బాగుంటుంది? అనే విషయమై గణిత నిపుణులు తయారు చేసిన ఓ సిద్ధాంతం తేలుస్తున్నది. దాని వివరాలేంటో ఈ స్టోరీ చదివి మీరూ తెలుసుకోండి.
మ్యాథమెటికల్ ఎక్స్‌పర్ట్స్ టామ్ గ్రిఫిత్స్, బ్రియాన్ క్రిస్టియన్ రచించిన అల్గారిథమ్స్ టు లైవ్ బై ది కంప్యూటర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ డెసిషన్స్ పుస్తకం ఆధారంగా పలు విశ్లేషణలు రూపొందుతున్నాయి. ఆ ప్రకారంగా మ్యారేజ్ చేసుకోవడాని ఉత్తమ వయసు 26 ఏళ్లు. ఇందుకు మ్యాథమెటికల్ కాల్కులేషన్స్ కూడా ఉన్నాయట. నిర్ణీత కాలవ్యవధి ఆధారంగా ఈ లెక్కలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏజ్‌లో పెళ్లి చేసుకున్న వారు తర్వాత తీసుకునే నిర్ణయాలు లైఫ్, కెరీర్ ఇతరాల గురించి సరైన దశలో ఉంటాయని అంచనా కడుతున్నారు.
సామాజికవేత్త నికోలస్ అధ్యయనం ప్రకారం మ్యారేజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ ఏజ్ 28 నుంచి 32 ఏళ్లు. అయితే, వివాహ భావన వచ్చిందంటే చాలు చేసేశేవారు పూర్వం. కానీ, మారుతున్న కాలపరిస్థితులు ఇతర సిచ్యువేషన్స్ దృష్ట్యా ప్రజెంట్ జాబ్ వచ్చాకనే మ్యారేజ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు యువతీ యువకులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, అది మంచిదేనని గణిత సిద్ధాంతం పేర్కొంటున్నది. కానీ, ఏజ్ పెరిగేకొద్ది రకరకాల సమస్యలొచ్చే అవకాశాలున్నాయి. ఈ గణిత సిద్ధాంతాన్ని చాలా మంది నమ్మడంతో పాటు ఒప్పుకున్నారు. కానీ, దీనిని సందేహించే వారు కూడా చాలానే ఉన్నారు. ఈ ఫార్ములా బేసిస్‌తో లైఫ్ రన్ కాదని వారు వాదిస్తున్నారు.