కుప్పంలో చంద్రబాబు బట్టలు ఊడగొడతాం : పెద్దిరెడ్డి

-

కుప్పంలో చంద్రబాబు బట్టలు ఊడగొడతామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. “పెద్దిరెడ్డి తమాషా చేస్తున్నావా.. నీ తడాఖా ఏంటో చూస్తా ” అని హెచ్చరించారు.

టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతావా? అని నిలదీశారు చంద్రబాబు. అయితే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు పెద్దిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు తనను పుంగనూరు పుడింగి అనడంపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను పుడింగి అంటున్నావు, ఆ పదానికి అర్థం తెలుసా’ అని ప్రశ్నించారు. ‘కుప్పంలో గోరంగా ఓడిపోయావు, పుంగనూరుకు వచ్చి నన్నేం చేస్తావు?’ అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు చెరువుల నీళ్లు తాగించిన విషయం మర్చిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో బట్టలూడగొడతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version