ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు కురిపించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో అక్రమ మైనింగ్కు సంబంధించి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రకృతి సంపదను అమ్ముకున్నారని, మదనపల్లిలో ఫైళ్లు తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనలేదని, ఆర్టీసీ ఆస్తులను అమ్మేసిందని ధ్వజమెత్తారు. తాము మాత్రం ఆర్టీసీ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నమని మంత్రి తెలిపారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.