తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ల కు మినహాయింపు కల్పించింది. ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాల ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. కుల గణనలో 36,549 మంది ఎస్ఓటీలు, 3,414 మంది ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు పాల్గొనేలా ప్లాన్ చేసింది. 6,256 మంది ఎంఆర్సీలు, రెండు వేల మంది మినిస్టీరియల్ సిబ్బంది కూడా కుల గణనలో ఉంటారని స్పష్టం చేసింది.
అదేవిధంగా కుల గణన నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ ఆరో తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుల గణన కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వీరంతా ఆదివారం, సెలవు రోజుల్లో కూడా రోజంతా పని చేయాల్సి ఉంటుంది.